Thursday, 25 June 2020

Chudaramma Satulala - చూడరమ్మ సతులాలా సోబాన పాడరమ్మ

108 Names of Goddess Andal


చూడరమ్మ సతులాలా సోబాన పాడరమ్మ || (చూడరమ్మ..)
కూడున్నది పతి చూడికుడుత నాంచారి || (చూడరమ్మ)
సోబానే సోబానే సోబానే సోబానే ||

శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు 
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు || (శ్రీమహాలక్ష్మి)
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు|| (సోముని)
కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి || (సోముని)

చూడరమ్మ సతులాలా సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడికుడుత నాంచారి 
సోబానే సోబానే సోబానే సోబానే |

కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు 
తలపలోకమాతయట దయ మరిఏమరుదు || (కలశాబ్ధి )
జలజనివాసినియట చల్లదనమేమరుదు || (జలజనివాసినియట )
కొలదిమీర ఈ చూడికుడుత  నాంచారి || (జలజనివాసినియట )

చూడరమ్మ సతులాలా సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడికుడుత నాంచారి
సోబానే సోబానే సోబానే సోబానే |

అమరవం దితయట అట్టీ మహిమ ఏమరుదు
అమౄతము చుట్టమట ఆనందాలకేమరుదు || (అమరవం )
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె || (తమితో)
కోమరివయస్సు ఈ చూడికుడుత నాంచారి || (తమితో)

చూడరమ్మ సతులాలా సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడికుడుత నాంచారి ||(చూడరమ్మ)
సోబానే సోబానే సోబానే సోబానే ||

No comments:

Post a Comment